నేడు విశాఖలో పర్యటించనున్న జగన్

69చూసినవారు
నేడు విశాఖలో పర్యటించనున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం ఘటనలో గాయపడి అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఉదయం 11 గంటలకు పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారని వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శిస్తారని పేర్కొంది.
Job Suitcase

Jobs near you