ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు

62చూసినవారు
ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు
AP: కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఆయా కంపెనీల నుంచి కమీషన్లు తీసుకునేందుకు వీలుగా వాటికి చెల్లించే మూల ధరల్ని భారీగా పెంచేశాయన్న ఫిర్యాదులున్నాయి. అయితే ప్రస్తుతం 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్‌ను తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి రాష్ట్ర బేవరేజస్ సంస్థ కొనే ధర తగ్గింది. ఆయా బ్రాండ్లపై రూ.30 వరకు తగ్గడంతో వినియోగదారులకు ఊరట కలిగింది.

సంబంధిత పోస్ట్