

దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోంది: కాంగ్రెస్ ఎంపీ (వీడియో)
జర్నలిస్టులు, యూట్యూబర్లపై జరుగుతున్న దాడులను లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్రంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే వారిపై హింసాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి. ఇవి మన ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తాయి" అని అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు.