సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పవన్‌కు అర్హత ఉందా? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చి మాట్లాడటానికి ఇది సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడి, గెలిచాక అవన్నీ మర్చిపోయారు" అని పవన్ తీరుపై నిప్పులు చెరిగారు.