ఫ్లిప్‌కార్ట్‌లో కుంభమేళా జలాలు
12 ఏండ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా మొదలైంది. ప్రతి ఒక్కరికి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలని ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లలేని వారు రెండు, మూడు చుక్కల త్రివేణి జలాలను స్నానం చేసే నీటిలో కలుపుకుని చేయవచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. సంగమ జలాలను స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయని, అలాగే ఈ నీరు ఫ్లిప్ కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంటాయట. పుణ్య స్నానం ఆచరించిన తర్వాత దాన ధర్మాలు చేయాలని ఆయన సూచించారు.