AP: అనంతపురం జిల్లాలో ఉన్న పి.కొత్తపల్లి గ్రామ ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోరు. కొన్ని శతాబ్ధాల క్రితం ఓ సంక్రాంతి పండక్కి సరుకులు కొనుగోలు చేయడానికి కొత్తపల్లికి చెందిన వ్యక్తి ఆత్మకూరు సంతకు వెళ్లి ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయారు. ఆ మరుసటి రోజు సంతకు వెళ్లిన ముగ్గురు హఠాన్మరణం చెందారు. దీంతో సంక్రాంతి పండుగను చేసుకోకూడదని అప్పటి గ్రామ పెద్దలు తీర్మానం చేశారు.