తొక్కిసలాట ఘటనపై స్పందించిన తిరుపతి కలెక్టర్
తొక్కిసలాట ఘటనపై ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు. ‘గేట్ సడెన్గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఉన్నారు. మిగతా వారు వైజాగ్, నర్సీపట్నానికి చెందిన వారుగా గుర్తించి, వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నాం’ అని కలెక్టర్ చెప్పారు.