ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి 19 (ఆదివారం) వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఇటీవల తెలిపింది. దీంతో పది రోజులపాటు స్కూళ్లు బంద్ కానున్నాయి. కాగా 20వ తేదీ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. కాలేజీలకు సెలవులపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి మీరు సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు?