AP: తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుగురి చావుకు కారణమైన సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని సీఎం పర్యటనకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి సామాన్యులంటే ఇంత నిర్లక్ష్యమా?, ఈ ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేయాలని కోరారు.