TG: న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని దాడి.. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల (D) భీముని మల్లారెడ్డి గ్రామంలో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన తన క్లాస్ మేట్ అమ్మాయికి శివకిషోర్ న్యూ ఈయర్ విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేయడంతో శివకిషోర్ సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు పరారయ్యారు. శివకిషోర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదయింది.