పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం (వీడియో)

79చూసినవారు
యూపీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్ జిల్లా బిలారిలోని రిలీ చౌక్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం భారీగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్