భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది కేంద్రం. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. నవంబర్ 26 నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే మంగళవారం పాత పార్లమెంటు భవనంలో జరిగే 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి దౌప్రది ముర్ము అధ్యక్షత వహించనున్నారు.