AP: ఆర్ అండ్ బీ శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 1307 కిమీ పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్దతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో 13 వేల కిమీ అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాలని పూర్తి నాణ్యతతో మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు. అయితే నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.