పాన్ 2.0 ద్వారా పాన్ కార్డు ఆధునికీకరణకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1435 కోట్లు కేటాయించింది. పాన్ కార్డు 2.0తో డిజిటల్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డుల పంపిణీ చేస్తామన్నారు. పేపర్‌లెస్, ఆన్‌లైన్ విధానంలో కొత్త పాన్‌కార్డు ఉంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.