సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించని అల్లు అర్జున్
మరోసారి మీడియాతో మాట్లాడిన హీరో అల్లు అర్జున్.. అరెస్ట్ సమయంలో అండగా నిలిచిన ఫ్యాన్స్, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని అన్నారు. అయితే అటు తన అరెస్టు వెనక కుట్ర ఉందన్న ప్రచారంపై బన్నీ స్పందించలేదు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆయన సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో వెళ్లిపోయారు.