AP: విజన్-2047 పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రం దిశ మారాలంటే విజన్లు కాదని, విభజన హామీలు నెరవేర్చాలన్నారు... పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరిగేదన్నారు. పన్నుల్లో రాయితీ, వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి దక్కేదన్నారు. విభజన హామీలను పక్కపెట్టిన వారిలో చంద్రబాబు, జగన్, మోదీలు ముద్దాయిలని పేర్కొన్నారు.