Top 10 viral news 🔥
తెలంగాణ తల్లిని చూస్తే, నా తల్లి లాగే స్పురించింది: సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)
తెలంగాణ తల్లిని చూస్తే, నా తల్లి స్పురించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గత పది సంవత్సరాలు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది. ఈ తెలంగాణ తల్లిని చూసినప్పుడు, చిన్నప్పుడు నా తల్లి ఏవిధంగా ఉండేదో కళ్లకు కట్టినప్పుడు స్పురించింది' అని పేర్కొన్నారు.