తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి చిత్ర రూపాన్ని వక్రీకరించడం, అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, అవమానించడం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 9న ఈ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరుపుకోవాలని తెలిపింది.