నిన్న మొన్నటి దాకా ఆకాశన్నంటిన టమాట ధర సోమవారం భారీగా పతనమైంది. మార్కెట్‌లో కిలో రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉన్న టమాట ధర.. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌లో ఒక్కసారిగా కిలో టమాటా ధర ఒక్క రూపాయికి పడిపోయింది. దీంతో పెట్టుబడులు, కిరాయిలు, కనీసం కూలి డబ్బులు కూడా రావడం లేదంటూ టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.