రాష్ట్రంలో సంక్షేమ సుపరిపాలన సాగుతుందని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పెడన జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో మంచి పాలన సాగుతుందని తెలిపారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.