

బంటుమిల్లి: సరిహద్దు వివాదం - పోలీసుల రంగ ప్రవేశం
భూ సరిహద్దు తగాదాలతో కోర్టును ఆశ్రయించిన వ్యక్తికి సెక్షన్ 145 అమలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను విస్మరించడంతో బంటుమిల్లి మండలం తుమ్మిడికి చెందిన ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో బంటుమిల్లి ఎస్సై గణేశ్ కుమార్ తన సిబ్బందిని వివాదంలో ఉన్న భూమి వద్దకు పంపించారు. అప్పటికే అక్కడ పనులు చేపడుతున్న మరో రైతును పోలీసులు ప్రశ్నించారు.