పెడన: దేవాలయాల్లో దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
బంటుమిల్లి మండలంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు దుర్గాష్టమి పండుగ రోజైన గురువారం బంటుమిల్లి మండలంలోని పలు దేవాలయాల్లో అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఆయా ఆలయాల్లో అమ్మవారికి ఉదయం, సాయంత్రం కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.