బంటుమిల్లి: భక్తి శ్రద్ధలతో జరుపుకున్న నాగుల చవితి
బంటుమిల్లి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు మంగళవారం నాగుల చవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగుల చవితి పురస్కరించుకుని ప్రజలు ఉదయాన్నే పుణ్య స్నానాలను ఆచరించి వారి వారి గృహాలలో నాగేంద్రుని భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆయా గ్రామాలలో దేవాలయాల వద్ద, పంట కాలువల వద్ద గల నాగుల పుట్టలలో పాలు పోసి, ఆ నాగేంద్ర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించారు.