బంటుమిల్లిలో ఉత్సాహంగా భోగి పండుగ

675చూసినవారు
బంటుమిల్లిలో ఉత్సాహంగా భోగి పండుగ
బంటుమిల్లి మండలంలో గ్రామ గ్రామాన భోగి పండుగను ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకి యువకులు, పెద్దలు, ఉత్సాహంగా భోగి మంటలు వేసి సంక్రాంతి కి స్వాగతం చెబుతూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అతి భయంకరమైన కరోనా భోగి మంటల్లో కరోనా మహమ్మారి మాడి మసై పోవాలని ప్రజలు ఆర్థిక పరిపుష్టి పొందాలని ఆకాంక్షిస్తూ భోగి మంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరింతలు కొడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బంటు మిల్లీ సంత మార్కెట్ మర్రిచెట్టు సమీపంలో ఆర్యవైశ్య యూత్ ఆధ్వర్యంలో భోగి మంటలు కార్యక్రమం ఘనంగా జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్