జాతీయ రహదారిపై లారీ బోల్తా - ఇరువురు మృతి
చల్లపల్లి మండలంలోని 216 హైవేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చల్లపల్లి మండలం నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. లారీ కింద పడి ఇరువురు మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు వెంటనే చల్లపల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటన చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. టిప్పర్ కింద ఒక వ్యక్తి మృతదేహాలు కనిపిస్తున్నాయి.