చల్లపల్లి మండలం రామానగరంలో శ్రీరామాలయ ప్రాంగణంలోని శ్రీగంగానమ్మ తల్లికి గురువారం మహిళలు ఆషాడ సారె సమర్పించారు. మేళతాళాలతో భారీ ఊరేగింపుగా మహిళలు అమ్మవారికి సారె తీసుకువచ్చారు. చీరలు, పూలు, పండ్లు, స్వీట్లు, గాజులు, పసుపు, కుంకుమలు శిరస్సున ధరించి గంగానమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి సారె సమర్పించారు. రావి చెట్టుకు, వేప చెట్టుకు పూజలు నిర్వహించారు.