అవనిగడ్డ: భక్తిభావాన్ని కలిగించిన మురళీ కోలాట ప్రదర్శనలు
దేవీశరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయిలో జరుగుతున్న మురళీకోలాట ప్రదర్శనలు భక్తులతో అధ్యంతమూ భక్తిభావాన్ని కలిగించాయి. ఘంటసాల మండలం చిట్టూర్పులోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో జరుగుతున్న మురళీ కోలాట ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి దేవి కామాక్షితోపాటు మూడు గ్రూపుల వారు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.