ఘంటసాల మండల పరిధిలోని కొడాలి - మొవ్వ ప్రధాన రహదారిలో భారీ వృక్షం శనివారం నేలకొరిగింది. వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. కూచిపూడి ఎస్ఐ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు నేతృత్వంలోని సిబ్బంది వృక్షాన్ని తొలగింపు చర్యలు చేపట్టి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. దీంతో వాహనదారులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.