Nov 19, 2024, 06:11 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య
Nov 19, 2024, 06:11 IST
తల్లిదండ్రులు పెళ్లికి బలవంతం చేస్తుండడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాలోని కటికెనపల్లి గ్రామానికి చెందిన కాల్వ కనుకయ్యకు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కూతురు సంధ్య (22) డిగ్రీ చదివింది. పైచదువులు చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ ఆమెకు పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ఇష్టం లేని సంధ్య ఆదివారం ఇంటి వాసానికి చున్నీతో ఉరేసుకుంది.