యాదవ సోదరులు దేవుని బిడ్డలు, వారసులు అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలోని మామిడితోటలో ఆదివారం జరిగిన యాదవ సంఘం వన సమారాధన కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది.