Nov 05, 2024, 17:11 IST/
కారు ఢీ.. ఎగిరిపడ్డ బైకర్ (వీడియో)
Nov 05, 2024, 17:11 IST
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో ఓ బైకర్ వాహనాలను గమనించకుండా మెయిన్ రోడ్డుపైకి వెళ్లాడు. అతివేగంతో వస్తున్న కారు ఆ బైకును ఢీకొట్టింది. బాధితుడు ఒక్కసారిగా ఎగిరిపడగా, బైక్ దూరంగా పడిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.