ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో IED బాంబు కలకలం రేపింది. పోలీసులనే లక్ష్యం చేసుకొని మావోయిస్టులు అమర్చిన 5 కిలోల IED బాంబుని కనుగోని బద్రతా బలగాలు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల ఎరివేత లక్ష్యంగా సవ్నార్ నుండి కోర్చోలి ఆటవి ప్రాంతంలో బీజాపూర్ DRG, కోబ్రా బలగాలు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ప్రెజర్ స్విచ్ సిస్టమ్ ద్వారా నాటబడిన IED ని BDS బృందం నిర్వీర్యం చేయడంతో పోలీసులకు పెను ప్రమాదం తప్పింది.