TG: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. తన తండ్రితో కలిసి ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన మసూమ్ (4) అనే బాలుడిని పట్టపగలు ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బాలుడిని 12 గంటల్లో సురక్షితంగా కాపాడారు. పోలీసులు నిందితుడైన షేక్ రఫీని అరెస్ట్ చేశారు.