నందిగామ: మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
ప్రేమ పేరుతో వేధించి అత్యాచారం చేసి కిరోసిన్ పోసి బాలిక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఫాస్ట్ కోర్టు ద్వారా కేసును నడపాలని గురువారం నందిగామ గాంధీ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధిత కుటుంబానికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది షేక్ ఆజాద్, యరగొర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.