Sep 30, 2024, 16:09 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
లడ్డూ కల్తీ కారకులపై చర్యలు తీసుకోవాలి
Sep 30, 2024, 16:09 IST
తిరుమల తిరుపతి దేవస్థానం అందించే వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేయడంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కరరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.