సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని యునియన్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. మాణిక్యం అనే ఖాతాదారుడిని ఏమరపాటుకు గురిచేసి 7వేల రూపాయలను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేసిన వ్యక్తిని వైన్ షాప్ వద్ద గుర్తించి చాకచక్యంగా బ్యాంకు సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం దొంగను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించి కేసు పెట్టారు. దొంగను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బ్యాంకు సబ్ స్టాప్ రాజేష్ ను అభినందించారు.