విజయవాడ: బీసీ హాస్టళ్ల పనితీరు మెరుగుకు చర్యలు
రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల పనితీరు మెరుగుపర్చడానికి ఇన్ స్పెక్షన్ యాప్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. హాస్టళ్ల ఖాళీగా ఉన్నపోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై హెల్త్ డైరీ నిర్వహించాలని ఆదేశించారు. హాస్టళ్ల నిర్వహణ-విద్యార్థుల భద్రతపై అనేఅంశంపై డీబీసీడబ్ల్యూవోలు, హెచ్ డబ్ల్యూవోలతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.