విజయవాడ: సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
నాయి బ్రాహ్మణులకు నెలకు 25వేలు జీతం పెంచినందుకు ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న మాటకు నిలబడి దేవాలయాలలో క్షవర వృత్తి చేస్తున్న వారికి నెలకు 25 వేల రూపాయలు జీతం పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.