ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు. ఉయ్యూరులో ప్రసిద్ధిగాంచిన జగదాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు సోమవారం లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చిన సందర్భంగా అమ్మవారికి రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.