

ఆదోని: అంబేడ్కర్ భవన్ స్థలంపై వక్ఫ్ బోర్డు ప్రకటన సరికాదు
ఆదోనిలో అభ్యుదయ దళిత్ సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని సభ్యుడు రంగన్న బుధవారం తెలిపారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ 50 సెంట్ల స్థలం కేటాయించారని, తాత్కాలికంగా షెడ్డు నిర్మించి సేవా కార్యక్రమాలు సాగిస్తున్నామని చెప్పారు. అయితే ఈ స్థలం వక్ఫ్ బోర్డుకు చెందిందన్న ప్రకటనను ఆయన తప్పుబట్టారు.