అంగరంగ వైభవంగా శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు
ఆదోనిలో వెలసిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు సందర్భంగా శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వందల మందికి ఉచితంగా చల్లటి మజ్జిగ అందించి ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించారు. లెక్కల సిద్ధారెడ్డి, లెక్కల ఓబులమ్మ కోగటం కొండారెడ్డి, ముడమాల చెన్న కేశవరెడ్డి, అరిగెల వెంకటేష్, నారాయణరెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, పొలిరెడ్డి పాల్గొన్నారు.