ఆళ్లగడ్డ మండలం జీ. జంబులదిన్నెలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హరినాథ్ రెడ్డి సోమవారం సమీపంలోని రైతు సేవా కేంద్రంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.