Oct 22, 2024, 05:10 IST/శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి
చందానగర్: వెంటపడిన కుక్క.. మూడో అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
Oct 22, 2024, 05:10 IST
చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి చందానగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్ వెంట పడటంతో దాని నుండి తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.