కౌతాళంలో భార్య కాపురానికి రాలేదని, పురుగుల మందు తాగిన వ్యక్తి
మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన మహేష్ భార్య కాపురానికి రాలేదని పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ ద్వారా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, బాధితుడు మామ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.