నంద్యాల జిల్లాలో విషాదం
నంద్యాల జిల్లాలో పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జరిగింది. మిడుతూరుకు చెందిన ఇంటర్ చదువుతున్న ఓ యువతికి ఇటీవల బంధువుల ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది.పెళ్లి చేస్తారేమోననే ఆందోళనతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ సోమవారం ఆమె మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.