నందవరంలో మహిళ ఆత్మహత్య
నందవరానికి చెందిన స్రవంతి (24) అనే మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. మహిళకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి ఆమె మతిస్థిమితం సరిగా లేక బాధపడుతున్నారు. కొద్దిరోజుల నుంచి పుట్టింట్లో ఉంటున్న ఆమె శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.