ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు
కర్నూలు జిల్లా నందవరం మండలం పూలచింత గ్రామ పాఠశాలలో చదువుతున్న దళిత విద్యార్థుల పట్ల వివక్షత చూపి కించపరిచిన ఘటనలో విద్యార్థి సంఘాల పోరాటం, దళిత సంఘాల నిరసన ఫలితంగా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు విచారణ చేసి మంగళవారం ఉపాధ్యాయులను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న హెచ్ఎం, మరో ఉపాధ్యాయుడు దళిత విద్యార్థుల పట్ల వివక్షత చూపడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.