రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా దేశవ్యాప్తంగా 500 జిల్లాలలో రైతులు, కార్మికులు, కవులు, ప్రజా సంఘాలు భారీ ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ మోర్చా, కార్మిక, కర్షక సంఘాలు ఈ మహా ప్రదర్శన విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని కోటవీధిలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు తిక్కిలి వెంకటేశ్వర్లు నేతృత్వంలో సంబంధిత కరపత్రాలు విడుదల చేసారు.