ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు. శుక్రవారం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని, లేకపోతే అప్పుడు వారి నుంచి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలని అన్నారు.