Sep 26, 2024, 05:09 IST/అంబర్పేట్
అంబర్పేట్
షాప్ షట్టర్ వద్ద మహిళ మృతదేహం లభ్యం
Sep 26, 2024, 05:09 IST
నల్లకుంట మండలంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫీవర్ హాస్పిటల్ సమీపం శివానంద నగర్ లో ఒక షాప్ షట్టర్ వద్ద 35 సంవత్సరాల మహిళ మృతదేహం లభ్యం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా, మృతురాలి వద్ద ఆధార్ కార్డు దొరికింది. అందులోని చిరునామా ప్రకారం మృతురాలు వారాసిగూడ ఎల్ ఎల్ నగర్ కు చెందిన భాసుపల్లి ప్రసాద్ భార్య అర్చనగా గుర్తించారు. మృతురాలి బంధువులు ఉంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు.